Chahal-Kuldeep కలిసి 2019 లో చివరిసారి.. జడేజా కారణంగానే | Ravindra Jadeja || Oneindia Telugu

2021-05-21 73

Yuzvendra Chahal-Kuldeep Yadav Could Have Played Together Had Ravindra Jadeja Been a Medium Pacer, Here’s Why
#ChahalKuldeep
#YuzvendraChahal
#RavindraJadeja
#KuldeepYadav
#HardikPandya
#INDVSENG

ఒకప్పుడు టీమిండియాకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో అద్భుత విజయాలు అందించిన మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్. ఈ జోడి మధ్య ఓవర్లలో పరుగులు కట్టడిచేస్తూ.. వికెట్లు తీసి ప్రత్యర్ధిని ఒత్తిడిలోకి నెట్టేవారు. ఇద్దరూ మణికట్టు స్పిన్నర్లు కావడంతో బాగా సక్సెస్ అయ్యారు. కెప్టెన్ నమ్మకాన్ని ఎన్నోసార్లు నిలబెట్టారు కూడా. అభిమానులు 'కుల్-చా' అని కూడా పిలుచుకునే వారు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ జోడి కలిసి ఆడేందుకు అవకాశం రావడం లేదు. కుల్దీప్, చహల్ కలిసి 2019 జూన్‌లో చివరిసారి ఆడారు. అయితే స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కారణంగానే తామిద్దరం కలిస్ ఆడే ఛాన్స్ రావడం లేదని అంటున్నాడు చహల్.